HomeTelugu Trending'లైగర్‌' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

‘లైగర్‌’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

vijay devarakonda liger mov

టాలీవుడ్‌ రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ నటిస్తున్న పాన్‌ ఇండియా మూవీ ‘లైగర్‌’. పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. కరణ్‌ జోహార్, పూరి జగన్నాథ్, చార్మి, అపూర్వా మెహతా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ షరవేగంగా జరుగుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.

తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్‌ ఫిక్స్‌ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 25న విడుదల చేస్తామని ప్రకటించారు. ఇక ఈ ఏడాది చివర్లో డిసెంబర్‌31రోజు లైగర్‌ గ్లింప్స్‌ను రిలీజ్‌ చేస్తామని ప్రకటించారు. స్పోర్ట్స్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మైక్‌ టైసన్‌ కీలకపాత్రలో కనిపించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu