తెలంగాణలో జనసేన మద్దతుపై క్లారిటీ

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేది లేదని ప్రకటించారు.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లోనే జనసేన పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. కానీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇచ్చే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. అయితే దీనిపై కొంత క్లారిటీ ఇచ్చారు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్‌చార్జ్‌ నరాల సత్యనారాయణ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఎవరికీ మద్దతు ఇవ్వట్లేదని స్పష్టం చేశారు. బోనకల్‌లో మీడియాతో మాట్లాడియన ఆయన.. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తమ పార్టీకి మద్దతు ఇస్తోందంటూ కొందరు ప్రచారం చేసుకుంటున్నారని.. కానీ, ఇందులో వాస్తవం లేదని… ముందస్తుగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండడంతో జనసేన ఈ ఎన్నిలకు దూరంగా ఉంటుందని తెలిపారు.