HomeTelugu Trendingడై హార్డ్ ఫ్యాన్.. ప్రభాస్‌ రాకపోతే టవర్‌ నుంచి దూకేస్తా!

డై హార్డ్ ఫ్యాన్.. ప్రభాస్‌ రాకపోతే టవర్‌ నుంచి దూకేస్తా!

1 9యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ కోసం ఓ యువకుడు సెల్‌ టవర్‌ ఎక్కాడు. అత్యంత ప్రమాదకరంగా సెల్‌ టవర్‌ అంచు మీద నిలబడి.. ప్రభాస్‌ వస్తేనే టవర్‌ దిగుతానని, లేకపోతే దూకి చస్తానని బెదిరిస్తున్నాడు. జనగామ జిల్లా యశ్వంత్‌పుర పెట్రోల్‌ బంక్‌ పక్కన ఉన్న రిలయన్స్‌ సెల్‌ టవర్‌పైకి గుగులోతు వెంకన్న అనే యువకుడు ఎక్కాడు. గుగులోతు వెంకన్నది మహబూబాబాద్‌. అతడు ప్రభాస్‌ అభిమాని అని తెలుస్తోంది. ప్రభాస్‌ అంటే ఇష్టమని, ప్రభాస్‌ను చూడాలని ఉందని సెల్‌ టవర్‌ ఎక్కిన వెంకన్న డిమాండ్‌చేస్తున్నాడు. తనను చూసేందుకు, కలిసేందు ప్రభాస్‌ రాకపోతే సెల్‌ టవర్‌ దూకేస్తానని అతను బెదిరిస్తున్నాడు. ఇదేమీ విడ్డూరమని విస్తుపోతున్న స్థానికులు.. యువకుడిని బతిమాలి కిందికి దించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu