HomeTelugu Trendingబిగ్‌బాస్‌ పై హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు..

బిగ్‌బాస్‌ పై హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు..

Lakshmi menon comments on bబుల్లి తెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్‌బాస్. అన్ని భాషల్లో మంచి ప్రజాదరణ పొందుతున్న ఈ షో.. తెలుగులో ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకొని నాలుగో సీజన్ జరుపుకుంటుంది. అయితే బిగ్ బాస్ మీద కొందరు విమర్శలు కూడా కురిసిపిస్తూ ఉన్నారు. మొదటి నుంచి ఈ షో ఎంత పాపులారిటీ సొంతం చేసుకుందో అదే స్థాయిలో ట్రోల్స్ విమర్శలు కూడా ఎదురవుతూ ఉన్నాయి. తాజాగా బిగ్ బాస్ పైన ఓ హీరోయిన్ సంచలన కామెంట్లు చేసింది. అయితే అది తెలుగు బిగ్ బాస్ మీద కాదు తమిళ బిగ్ బాస్ లోక నాయకుడు కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. త్వరలో ఈ షో అక్కడ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో హీరోయిన్‌ లక్ష్మీమీనన్‌ తమిళ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ గా వెళ్లబోతుందని వార్తలు వినిపించాయి. ఈ వార్తలపై స్పందించిన లక్ష్మీ మీనన్ “నేను బిగ్‌బాస్‌ షోలో పార్టిసిపేట్‌ చేయడం లేదు. నేను ఇతరులు తిన్న ప్లేట్స్‌ను కడగడం, టాయ్‌లెట్స్‌ను శుభ్రం చేసే పనులను ఇప్పటి వరకు చేయలేదు, చేయను కూడా.” అంటూ సమాధానం ఇచ్చింది. కెమెరాముందు షో కోసం ఫైటింగ్ చేయడం నాకు నచ్చదు. నేను బిగ్ బాస్ కు వెళ్తున్నా అంటూ వస్తున్న వార్తలు రూమర్స్ మాత్రమే అంటూ కొట్టిపారేసింది .

Recent Articles English

Gallery

Recent Articles Telugu