HomeTelugu Big Storiesజాన్వీ కపూర్‌ డాన్స్‌ వీడియో వైరల్‌

జాన్వీ కపూర్‌ డాన్స్‌ వీడియో వైరల్‌

5 24

జాన్వీ కపూర్ తన తల్లి శ్రీదేవి నట వారసత్వాన్ని ‌కొనసాగిస్తూ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రవేస్తోంది. ఈ ఏడాది వరుస చిత్రాల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. కార్గిల్‌ గర్ల్‌ గుంజన్‌ సక్సేనా బయోపిక్‌లో ఆమె టైటిల్‌ పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్‌ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. వీటితో పాటు ‘రూహీ అఫ్జానీ’, ‘దోస్తానా’ చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తోంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఓ డ్యాన్స్‌ వీడియోను జాన్వీ ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. అద్దం ముందు నిలబడిన ఆమె చేసిన డ్యాన్స్‌కు ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. పాత హిందీ పాటకు హావభావాలతో ఆమె చేసిన డాన్స్‌ను అభిమానులు మెచ్చుకుంటున్నారు. అచ్చం శ్రీదేవి డ్యాన్స్‌ చేసినట్లు ఉందని ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu