ఖాళీగా ఉన్నానని సినిమాలు చేయను!

‘రన్ రాజా రన్’, ‘ఎక్స్ ప్రెస్ రాజా’ వంటి వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో శర్వానంద్ ఈసారి ‘శతమానం భవతి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఈ సంధర్భంగా అతడితో కాసిన్ని ముచ్చట్లు..
మా సినిమాలో సంక్రాంతి పండగ..
సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయాలనే ప్లాన్ ముందు లేదు. నిజానికి మా సినిమాలో కూడా సంక్రాంతి పండగ చేసుకుంటున్నాం. అందుకే ఈ సినిమా సంక్రాంతి రిలీజ్ అయితే కరెక్ట్ అని రిలీజ్ చేస్తున్నాం.
బంధాలకు విలువనిచ్చే కుర్రాడు..
ఆనందాన్ని పది మందికి పంచాలి కానీ బాధను కాదు అనుకునే పాత్రలో కనిపిస్తాను. బంధాలకు, అనుబంధాలకు ఎక్కువగా విలువనిచ్చే కుర్రాడిగా కనిపిస్తాను. తాత ఆశయాలను కొనసాగించాలనుకునే మనవడు.
నో టెన్షన్..
గతేడాది సంక్రాంతికి మొత్తం నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. నాలుగు సినిమాలు హిట్ అయ్యాయి. సినిమా బావుంటే ఎన్ని రిలీజ్ అయినా.. ప్రేక్షకులు ఆదరిస్తారు. కాబట్టి నాకు ఎలాంటి టెన్షన్ లేదు.
యాసతో మాట్లాడతా..
సినిమా కొత్తగా ఏది నేర్చుకోలేదు కానీ బాష కొంత వరకు యాస ఉండేలా చూసుకున్నాను.
ఖాళీగా ఉన్నానని సినిమాలు చేయను..
నాకు కథ నచ్చాలి. ఆ కథను నమ్మి నేను సినిమా చేయాలి. అంతేకాని ఖాళీగా ఉన్నానని మాత్రం సినిమాలు చేయను.
తేజు చెప్పాడని కథ విన్నాను..
మొదట నాకు ఈ సినిమా చేసే ఉద్దేశ్యం లేదు. అయితే సాయి ధరం తేజ్ నీకు ఈ కథ బావుంటుంది ఒకసారి విను అని చెప్పాడు. కథ విన్న వెంటనే నేను చేయాలనుకున్నాను.
దేవకట్టా కథ రెడీ చేస్తున్నాడు..
ప్రస్థానం వంటి సీరియస్ తరహా సినిమాలైతే చేయాలని ఉంది.. దేవకట్టా ఓ కథను రెడీ చేస్తున్నాడు. అది వర్కవుట్ అవుతుందో.. లేదో.. చూడాలి.
పెళ్లి ఆలోచనలు లేవూ..
నేను హ్యాపీగా ఉండడం మీకు ఇష్టం లేదా..(నవ్వుతూ..) ప్రస్తుతానికైతే ఆలోచనలు లేవు.
నెక్స్ట్ ప్రాజెక్ట్స్..
బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ గారి సినిమాలో ఫన్నీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాను. అలానే మారుతి గారి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాను.