అదే నిజమైతే నాఅంత అదృష్టవంతురాలు ఎవరూ ఉండరు: జాన్వీ కపూర్‌

అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. యూత్ లో ఆమెకు ఎంతో క్రేజ్‌తో.. బాలీవుడ్ లో ఆమె దూసుకుపోతోంది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనే విషయంలో క్లారిటీ రానప్పటికీ… జాన్వీ కపూర్ ను ఎంపిక చేసినట్టు ప్రచారం జరుగుతోంది.

ఈ ప్రచారంపై జాన్వీ కపూర్ స్పందిస్తూ… తనకు తెలుగులో లేదా ఏదైనా సౌత్ సినిమాలో చేయాలనే కోరిక ఉందని చెప్పింది. జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం వచ్చిందనే రూమర్ నిజమైతే తనంత అదృష్టవంతురాలు ఎవరూ ఉండరని… అయితే దురదృష్టవశాత్తు తనకు అలాంటి ఆఫర్ రాలేదని తెలిపింది. జూనియర్ ఎన్టీఆర్ తో నటించే అవకాశం రావడమంటే మామూలు విషయం కాదని చెప్పింది. తారక్ తో అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని తెలిపింది. మరోవైపు జాన్వి ప్రస్తుతం మూడు చిత్రాల్లో నటిస్తోంది.

CLICK HERE!! For the aha Latest Updates