HomeTelugu Trendingరజనీకాంత్ జైలర్ నుంచి మరో సాంగ్

రజనీకాంత్ జైలర్ నుంచి మరో సాంగ్

Rajanikanth Jailor update
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం ‘జైలర్’ షూటింగ్ పూర్తిచేసుకుంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది.

జైలర్ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ చిత్రం ప్రమోషన్లు కూడా ప్రారంభించారు. జైలర్ సినిమాను తాజాగా విడుదల చేసిన తమన్నా చేసిన సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్‌ తో పాటు సోషల్ మీడియాలో కోట్లాది వ్యూస్ వస్తున్నాయి.

జైలర్ సినిమా నుంచి మరో పాటకు రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. ‘హుకుం’అనే పాటను సోమవారం విడుదల చేస్తున్నట్టు తెలియజేస్తూ ప్రోమోను వదిలారు.

ఇందులో ‘ఏయ్ ఇక్కడ నేనే కింగ్. నేను చెప్పేవే రూల్స్. రూల్స్ తప్పితే ఎవర్నీ వదిలిపెట్టను. ఇది హుకుం.. టైగర్‌‌ కా హుకుం’ అంటూ రజనీకాంత్ తన స్టైల్, స్వాగ్‌లో చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటోంది.

జైలర్‌ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఆగస్టు 10వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ మూవీలో తమన్నాతో పాటు మోహన్‌లాల్‌, రమ్యకృష్ణ, సునీల్, శివ రాజ్ కుమార్, జాకీష్రాఫ్, నాగబాబు నటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu