HomeTelugu Trendingహిందీ 'డియర్‌ కామ్రేడ్‌'లో జాన్వీ కపూర్!

హిందీ ‘డియర్‌ కామ్రేడ్‌’లో జాన్వీ కపూర్!

7 23విజయ్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ఈ సినిమా జులై 26 వ తేదీన విడుదల కాబోతున్నది. ఈ మూవీకి దక్షిణాది భాషల్లో మంచి హైప్ ఉన్నది. సినిమాపై అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. ఈ మూవీ హిందీ రైట్స్ ను కరణ్ జోహార్ తీసుకున్నారు. హిందీలో దీన్ని రీమేక్ చేయబోతున్నారట. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయట.

డియర్ కామ్రేడ్ హిందీలో కూడా విజయ్ నటిస్తారని వార్తలు వచ్చాయి. కానీ, అందులో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది. హిందీలో విజయ్ స్థానంలో ఇషాన్, రష్మిక ప్లేస్ లో జాన్వీ కపూర్ నటిస్తారని వార్తలు వస్తున్నాయి. కరణ్ జోహార్ కూడా ఈ విషయాని ద్రువీకరించినట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరు కలిసి ధఢక్ సినిమా చేశారు. ఈ మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ ద్వారా మరోమారు ఈ జంట సందడి చేయబోతున్నారన్నమాట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu