
Vijay Devarakonda Rashmika relationship:
తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా గుర్తుంపు తెచ్చుకుంది రష్మిక మందన్న. తన ప్రతిభతో పాన్ ఇండియా స్టార్‌గా పేరు సంపాదించడమే కాకుండా, అభిమానుల్లో భారీ క్రేజ్ సంపాదించుకుంది. చిన్నప్పుడు తనకు సినీ రంగం అంటే ఆసక్తి ఉండకపోయినా, కాలక్రమేణా ఆమె హిట్లు సాదించి టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. అయితే, ఆమె వ్యక్తిగత జీవితం ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తు ఉంటుంది. ముఖ్యంగా ఆమె విజయ్ దేవరకొండతో ఉన్న రిలేషన్ పై తరుచూ రూమర్స్ వస్తూ ఉంటాయి.
ఈ నేపథ్యంలో, రష్మిక ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కొని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసింది. రష్మిక ప్రకారం, తనకు ఎంత గుర్తింపు వచ్చినా, డబ్బు.. ప్రేమాభిమానాలు ఎన్ని లభించినా, తనకి ముఖ్యమైనది భాగస్వామిగా ఉండటం అని తెలియచేసింది. తన జీవితంలో ఉన్న వ్యక్తులతో.. గౌరవంగా జీవించడం ఆమెకు అత్యంత ప్రియమైన విషయం అని చెప్పుకొచ్చింది.
“ఇల్లు నాకు ఒక సంతోషకరమైన ప్రదేశం. ఇంట్లో ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. నా ఇల్లు, నా కుటుంబం చాలా పాజిటివ్‌గా అనిపిస్తుంది,” అని పేర్కొంది.
ఇంకా, రష్మిక తనకు కాబోయే భర్తకు ఉండాల్సిన లక్షణాలు గురించి చెప్పింది.మ. తనను ఎంతగానో ఆకర్షించే విషయాల గురించి తెలియజేస్తూ..కళ్ళు మనసుకు ప్రతిబింబాలని.. కళ్ళతో పలికించే హావభావాలనే తాను.. ఎక్కువగా నమ్ముతూ ఉంటానని నవ్వుతూ ఉండే వ్యక్తులను మాత్రమే తాను ఇష్టపడతానని, అలాగే ఎదుటివారిని గౌరవించే వారు అంటే తనకు ఇష్టమని వెల్లడించింది. ఇలా తన భాగస్వామి గురించి మాట్లాడడంతో ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. దీంతో రష్మిక మరొకసారి విజయ్ దేవరకొండ గురించే ఈ మాటలు చెప్పిందని.. అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
READ MORE: SSMB29 కోసం మహేష్ బాబు, ప్రియాంక NDA సైన్ చేయడానికి అసలు కారణం ఏమిటి?