HomeTelugu Trendingజాన్వీ కపూర్‌ టాలీవుడ్‌ ఎంట్రీ..హీరో ఎవరో తెలుసా!

జాన్వీ కపూర్‌ టాలీవుడ్‌ ఎంట్రీ..హీరో ఎవరో తెలుసా!

Janhvi kapoor tollywood ent

బాలీవుడ్‌ బ్యూటీ, అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్​ టాలీవుడ్‌ ఎంట్రీ గురించి ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. అది కూడా జాన్వీ ఫేవరెట్ హీరోతో అని టాక్​. అతనెవరో కాదు రౌడీ హీరో విజయ్​ దేవరకొండ.

బాలీవుడ్​ దర్శక నిర్మాత కరణ్​ జోహార్​ నిర్మాణంలో తెరకెక్కించే చిత్రంలో విజయ్ దేవరకొండకు పక్కన హీరోయిన్​గా జాన్వీ కపూర్​ నటించనుందట. తెలుగు, హిందీతోపాటు ఇతర భాషల్లోనూ విడుదలవుతున్న ఈ సినిమాకు డ్యాషింగ్ డైరెక్టర్​ పూరీ జగన్నాథ్​ డైరెక్షన్‌లో వస్తుంది అని సమాచారం.

Janhvi kapoor 1

అయితే ‘లైగర్’ మూవీలో మందుగా హీరోయిన్​గా జాన్వీనే అనుకున్నారట. కానీ కుదర్లేదు. అలాగే జాన్వీని మొదట తెలుగులోనే హీరోయిన్‌గా పరిచయం చేయాలనుకున్నారు శ్రీదేవి. ఫైనల్​గా ఈ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

మొదటగా సమంతనే విడాకులు కోరింది: నాగార్జున

Recent Articles English

Gallery

Recent Articles Telugu