కార్తి ‘దొంగ’ ట్రైలర్‌


హీరో కార్తి వైవిధ్యమైన కథలతో తమిళంతో పాటు, తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల ‘ఖైదీ’తో బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఆయన త్వరలో ‘దొంగ’ గా ప్రేక్షకులను పలకరించబోతున్నారు. తన వదిన జ్యోతికతో కలిసి నటించిన చిత్రమిది. జీతూ జోసెఫ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. ‘చిన్నా ఇంకా నా కళ్లలోనే ఉన్నాడు’ అంటూ జ్యోతిక డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. మధ్యలో ‘న్యాయంగా రాజమౌళి సినిమాలో నన్ను పెట్టాలి. ఎవరిరెవరినో పెడుతున్నారు’ అంటూ కార్తి ఫన్నీగా చెప్పడం నవ్వులు పూయిస్తోంది. కార్తి, జ్యోతిక.. అక్కా తమ్ముడిగా కనిపించనున్నారు. సత్యరాజ్, షావుకారు జానకి, నికిలా విమల్, రమేష్‌ తిలక్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు.గోవింద్‌ వసంత సంగీతం సమకూర్చారు. ఇప్పటికే చిత్రీకరణపూర్తి చేసుకున్న క్రిస్మస్‌ కానుకగా ‘దొంగ’ డిసెంబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

CLICK HERE!! For the aha Latest Updates