HomeTelugu TrendingGame Changer: ఫ్యాన్స్‌ని ఊపేస్తున్న 'జరగండి' సాంగ్‌

Game Changer: ఫ్యాన్స్‌ని ఊపేస్తున్న ‘జరగండి’ సాంగ్‌

Jaragandi Lyrical Video fro

Jaragandi song from Game Changer: ఈరోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే (మార్చి 27). ఈ సందర్భంగా ఆయనకు సోషల్‌ మీడియా వేదికగా.. అభిమానులు, సెలబ్రెటీలు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలో గేమ్ చేంజర్ నుంచి ‘జరగండి’ పాటను విడుదల చేశారు. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ పాట పలు కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. ఇక ఇప్పుడు రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ పాటను రిలీజ్ చేశారు.

తమన్ సంగీతం అందించిన ఈ పాట ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ మేరకు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఇక జరగండి పాటతో అభిమానులు ఊగిపోతోన్నారు. అనంత్ శ్రీరామ్ రాసిన ఈ పాటను.. మెహ్నిది, సునిధి చౌహాన్ ఆలపించారు. తమన్ క్యాచీ బీట్‌కు ప్రభుదేవా కొరియోగ్రఫీ అదిరిపోయింది.విజువల్స్, ఆ సెట్స్ కలర్‌ ఫుల్‌గా చాలా బాగున్నాయి.

తమిళ స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా దాదాపు షూటింగ్‌ను పూర్తి కావొస్తుంది. ఈ క్రమంలో ఈ మూవీ ప్రమోషన్స్‌లో జోర్‌ పెంచనున్నట్లు తెలుస్తుంది. ఇదే ఏడాదిలో గేమ్ చేంజర్‌ను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ బడ్జెట్, బిజినెస్, డిజిటల్ రైట్స్ విషయంలో పలు రూమర్లు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu