HomeTelugu Trendingమళ్లీ సినిమాల్లోకి జయాబచ్చన్

మళ్లీ సినిమాల్లోకి జయాబచ్చన్

Jaya Bhachan
బాలీవుడ్‌ సీనియర్‌ నటి, ఎంపీ జయా బచ్చన్‌ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రాజకీయాల్లోకి వెళ్లి తర్వాత సినిమాల్లో తక్కువగా కనిపించిన జయా బచ్చన్ ఏడేళ్లుగా వెండితెరపై కనిపించనేలేదు. ఇప్పుడు మళ్లీ ఓ మరాఠీ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఆమె తొలి మరాఠీ చిత్రం అంటున్నారు. దీనికి గజేంద్ర అహిరే దర్శకత్వం వహించనున్నట్లు టాక్‌. ఇతడు మరాఠీలో సుమారు 50కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసే జయాబచ్చన్ హిందీలోని పలు సినిమాల్లో తన నటనతో అభిమానులను కట్టిపడేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu