HomeTelugu Trendingవిమానం: అనసూయ ఫస్ట్‌లుక్‌

విమానం: అనసూయ ఫస్ట్‌లుక్‌

Anusuya first look from vim
యాంకర్‌, నటి అనసూయ సినిమాల్లో పలు విభిన్న పాత్రలతో బిజీగా ఉన్న సంగతి తెలసిందే. రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త పాత్ర టాలీవుడ్ లో ఆమెకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. అక్కడి నుంచి ఆమె వరుస సినిమాలతో బిజీగా మారింది. ముఖ్యంగా మాస్ రోల్స్ ఆమెకు బాగా క‌లిసొచ్చాయి. పుష్ప సినిమాలోనూ ఇలాంటి పాత్రతో ఆకట్టుకున్న అనసూయ తాజాగా మ‌రోసారి మాస్ క్యారెక్ట‌ర్‌తో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది.

ఆమె కీలక పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం విమానం. శివ ప్ర‌సాద్ యానాల డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా జూన్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సముద్రఖని ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ రోజు మే డే సంద‌ర్భంగా అనసూయ ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సినిమాలో అనసూయ బలమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది.

తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక‌కాలంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జీ సినిమాస్ స్టూడియో, సాయి కొర్రపాటి సంయుక్తంగా నిర్మించారు. మాస్టర్ ధ్రువన్, ధన్ రాజ్ రాహుల్, రామకృష్ణ, రాజేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నటి మీరా జాస్మిన్ ఈ సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టనుంది.

ఆస్తికరంగా ‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu