HomeTelugu Trending'సన్‌ ఆఫ్‌ ఇండియా' ఫస్ట్‌సాంగ్‌ వచ్చేసింది

‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ ఫస్ట్‌సాంగ్‌ వచ్చేసింది

Jaya Jaya mahaveera lyrical

డైలాగ్‌ కింగ్‌ మంచు మోహన్‌ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’. డైమండ్‌ రత్నబాబు డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాని శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్‌ సంస్థలు నిర్మించాయి. తాజాగా సినిమా నుంచి తొలి పాటను విడుదలైంది. ‘జయ జయ మహావీర..’ అంటూ సాగే ఈ పాటని ప్రముఖ సింగర్‌ రాహుల్‌ నంబియార్‌ ఆలపించగా, మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు. 11వ శతాబ్దపు ప్రసిద్ధ రఘువీర గద్యాన్ని పాట రూపంలో మలిచారు సంగీత దర్శకుడు ఇళయరాజా.

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ ఈ పాటను షేర్ చేస్తూ ‘భారతీయ సినిమా పరిశ్రమలోని ఇద్దరు దిగ్గజాలు .. ప్రముఖ తెలుగు నటుడు ఎం మోహన్ బాబు, మాస్ట్రో ఇళయరాజా కలిసి రాముడి శౌర్యానికి నివాళులర్పించిన ‘రఘువీరా గద్యం’లోని సాంగ్ ‘జయ జయ మహావీర’ సాంగ్. ఆల్ ది బెస్ట్’ అంటూ ట్వీట్ చేశారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ – శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకాలపై మంచు విష్ణు ఈ మూవీని నిర్మిస్తున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపోందుతుంది. ఈ సినిమాలో శ్రీకాంత్, ప్రగ్యా జైస్వాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తనికెళ్ళ భరణి, ఆలీ, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, రాజా రవీంద్ర, రఘుబాబు, రవి ప్రకాష్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu