HomeTelugu Trendingఆకట్టుకుంటున్న'ఉస్తాద్‌' టీజర్‌

ఆకట్టుకుంటున్న’ఉస్తాద్‌’ టీజర్‌

Ustaad Teaser
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీ సింహ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. హీరోగా ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమా ‘మత్తు వదలరా’ తో హిట్‌ టాక్‌ తెచ్చుకున్నాడు. ఆ తరువాత సరైన హిట్టు కొట్టలేకపోయాడు. తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, భాగ్ సాలే వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు.

ప్రస్తుతం ఉస్తాద్ సినిమాతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. వారాహి చలన చిత్రం బ్యానర్‌లో వస్తున్న ఈ మూవీతో ఫణిదీప్ దర్శకుడిగా మారబోతున్నాడు. సాయి కొర్రపాటి సమర్పణలో రజినీ కొర్రపాటి రాకేష్ రెడ్డి గడ్డం హిమాంక్ రెడ్డి దువ్వూరు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు.

ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. సింహా కోడూరి పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. మొదట్లో ఎత్తు నుంచి కిందకి చూడాలంటేనే గజగజా వణికిపోయి.. కళ్లు తిరిగి పడిపోయే కుర్రాడిగా శ్రీసింహ ఇరగదీశాడు. ఆ తర్వాత తనకు ఉన్న ఫోబియాను వదిలి పెట్టి పైలెట్ గా మారి నిజంగా హీరో అనిపించుకుంటాడు. ఓ సాధారణ యువకుడు భయాన్ని విడిచి పైలెట్ గా ఎలా మారాడన్నది కథ. కావ్య కల్యాణ్ రామ్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది.

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu