HomeTelugu Trendingదేవరలో పల్లెటూరిపిల్లలా 'తంగం' లుక్ అదుర్స్

దేవరలో పల్లెటూరిపిల్లలా ‘తంగం’ లుక్ అదుర్స్

Jhanvi from devara look

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న దేవర చిత్రంపై చాలా అంచనాలున్నాయి. ఈ హైఓల్టేజ్ యాక్షన్ చిత్రంలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ నుంచి జాన్వీ కపూర్ లంగా ఓణీలో పల్లెటూరి పిల్లలా కనిపిస్తున్న లేటెస్ట్ స్టిల్‌ను దేవర యూనిట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. లేలేత పరువాల జాన్వీ చిరునవ్వులు చిందిస్తూ చూడగానే ఆకట్టుకునేలా ఉంది.

దేవరలో జాన్వీ పాత్ర పేరు ‘తంగం’. “ఇదిగో మా తంగం” అంటూ చిత్రబృందం పోస్ట్ పెట్టింది. తమిళంలో తంగం అంటే బంగారం అని అర్థం. దేవర మూవీ షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో జాన్వీ కపూర్ పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ కూడా దేవర షూటింగ్ కోసం ఇటీవలే గోవా వెళ్లాడు.

దేవర మూవీలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. దేవర మూవీకి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా 2 భాగాలుగా రానుంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న మూవీ తొలిభాగం రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu