టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి తనకు కాబోయే భార్య మిహీకా బజాజ్ గురించి సోషల్ మీడియా వేదికగా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఆమె నా ప్రేమకు ఒకే చెప్పింది అంటూ ఆమెతో దిగిన ఫోటోను షేర్ చేశాడు. త్వరలో రానా త్వరలో పెళ్లి పీఠలు ఎక్కడానికి రెడీ అయ్యాడు. వీళ్లిద్దరి పెళ్లికి ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు అంగీకరించారు. అయితే రానా, మిహీకాల ఎంగేజ్మెంట్ ఈ రోజు ఇరు కుటుంబాలకు చెందిన పెద్దల సమక్షంలో జరగనుంది. ఈ వేడుకకు సినీ రంగానికి చెందిన కొద్ది మంది మాత్రమే హాజరయ్యే అవకాశం ఉంది. ఐతే.. రానా మాత్రం ఇంట్లో తల్లి తండ్రులతో పాటు వాళ్ల పేరేంట్స్ ఒప్పుకున్న తర్వాతే అందరికీ ఆమెను పరిచయం చేశాడు. ఈ రోజు జరిగే నిశ్చితార్థంతో వీళ్లిద్దరి పెళ్లి డేట్ పై క్లారిటీ రానుంది. ఈ యేడాది చివర్లో డిసెంబర్‌లో వీళ్ల పెళ్లి జరగనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
రానా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ‘మిహీకా బజాజ్’ కూడా హైదరాబాద్‌కు చెందిన అమ్మాయే. బంటీ బజాజ్, సురేష్ బజాజ్ దంపతుల కుమార్తె మిహికా. చెల్సియా వర్సిటీ నుంచి ఇంటీరియర్ డిజైన్ లో మాస్టర్స్ డిగ్రీ పొంది.. ‘డ్యూ డ్రాప్ డిజైన్’ అనే ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీని స్థాపించి విజయవంతంగా నిర్వహిస్తున్నారు.