HomeTelugu Big Stories'ఎవరు మీలో కోటీశ్వరులు'లో ఎన్టీఆర్‌ లుక్‌.. వైరల్‌

‘ఎవరు మీలో కోటీశ్వరులు’లో ఎన్టీఆర్‌ లుక్‌.. వైరల్‌

Jr NTR look leaked from Eva

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా జెమిని టీవీలో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకి హోస్ట్‌గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ‘ప్రపంచ వ్యాప్తంగా120 దేశాల్లో సక్సెస్ అయిన షో.. మీ జీవితాలని మార్చే గేమ్ షో.. మీ ఆశలని నిజం చేసే గేమ్ షో’ అంటూ జెమిని వారు ఇప్పటికే ప్రోమోని కూడా వదిలారు. అయితే ఎన్టీఆర్‌ హోస్ట్‌ అనేది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

ఈ నేపథ్యంలో తాజాగా ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ఎన్టీఆర్ ప్రోమోకి సంబంధించిన ఫొటోలు ఒకటి లీక్ అయ్యాయి. ఇందులో ఎన్టీఆర్ బ్లాక్ బ్లేజర్ ధరించి న్యూ హెయిర్ స్టైల్ తో ఉబర్ స్టైలిష్ గా ఉన్నాడు. ట్రిమ్ చేసిన గడ్డం మీసాలు అదనపు ఆకర్షణగా నిలిచాయి. మరోసారి ఎన్టీఆర్‌ను హోస్టుగా చూసేందుకు ఫ్యాన్స్ ఉత్సహంగా ఉన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ న్యూ లుక్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్వరలోనే ఎన్టీఆర్ హోస్ట్ అనే విషయాన్ని ఆఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఎన్టీఆర్ కి సంబంధించిన ప్రమోషనల్ మెటీరియల్ ని అన్నపూర్ణ స్టూడియోస్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో షూట్ చేసారని టాక్.

Recent Articles English

Gallery

Recent Articles Telugu