HomeTelugu Big Storiesప్రభాస్‌, మహేష్‌, రాజమౌళి ఓ మల్టీస్టారర్‌..!

ప్రభాస్‌, మహేష్‌, రాజమౌళి ఓ మల్టీస్టారర్‌..!

4 15
దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం ‘RRR’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్‌తోనే చాలా బిజీగా గడిపేస్తున్నాడు దర్శక ధీరుడు. మరో ఏడాది వరకు ఈ సినిమా తప్ప మరో ప్రపంచం కూడా లేదు. రాజమౌళి ఓ సినిమా చేస్తున్నపుడు మరో సినిమా గురించి అస్సలు ఆలోచన చేయడు. కానీ ఇప్పుడు మాత్రం ఈయన ఓ సినిమా చేస్తుండగానే చెయ్యబోయే సినిమా కూడా సెట్ చేసుకుంటున్నాడు. ఈయన కోసం స్టార్ హీరోలు క్యూ కడుతున్నారు. బాహుబలి తర్వాత ఎలాంటి సినిమా చేస్తాడా అని వేచి చూస్తున్న వాళ్లకు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్స్‌తో మల్టీస్టారర్ అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తైపోయింది.

దాంతో తరువాత ఏం సినిమా చేస్తాడనేది ఇప్పట్నుంచే హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రాజమౌళి తర్వాతి మూవీ కూడా మల్టీస్టారర్‌గా ఉండబోతుందని తెలుస్తుంది. ముఖ్యంగా మరోసారి తెలుగు సినిమా సూపర్ స్టార్స్ ఇద్దరిని కలిపి సినిమా చేయడానికి రాజమౌళి ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. మహేష్ బాబుతో రాజమౌళి సినిమా చేస్తున్నాడని చాలా రోజులుగా వార్తలొస్తున్నాయి.

రాజమౌళి కూడా దీన్ని కన్ఫర్మ్ చేసాడు. కేఎల్ నారాయణ నిర్మాణంలో ఈ చిత్రం ఉండబోతుంది. అయితే ఈ చిత్రంలో ప్రభాస్ కూడా మరో హీరోగా నటిస్తాడని తెలుస్తుంది. RRR తర్వాత ప్రభాస్, మహేష్ లాంటి స్టార్ హీరోలతో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడు. ముందు RRR అనుకున్నపుడు కూడా జరగదేమో అనుకున్నారు కానీ ఇప్పుడు జరిగింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu