HomeTelugu Trending'RRR' కోసం 'ఎన్టీఆర్‌' ని రాజమౌళి ఎలా మార్చేశాడో చూడండి!

‘RRR’ కోసం ‘ఎన్టీఆర్‌’ ని రాజమౌళి ఎలా మార్చేశాడో చూడండి!

4 3

దర్శకధీరుడు రాజమౌళి మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్‌ఆర్‌ అనే వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. ఫస్ట్ షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌, చరణ్‌లపై భారీ యాక్షన్‌ సీన్స్‌ చిత్రీకరించారు. కాగా ఫస్ట్ షెడ్యూల్ నిన్నటితో ముగిసింది. ఫిబ్రవరి వరకు రెస్ట్. సినిమా ప్రారంభానికి ముందు ఈ సినిమా గురించిన సమాచారం ఏదో ఒక రూపంలో బయటకు వస్తుండేవి. షూటింగ్ ప్రారంభం రోజున ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి ముగ్గురు కూర్చున్న ఫోటో, తరువాత రాజమౌళి రెడీ టాక్ యాక్షన్ అంటూ ప్రారంభించే చిన్న వీడియో బయటకు వచ్చింది.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాతో పాటు ఇందులో హీరోల లుక్స్ కొత్తగా ఉండబోతున్నాయట. ఫొటోలతో పాటు, వీడియోలు కూడా లీక్ అవుతుండటంతో.. రాజమౌళి షూటింగ్ స్పాట్ లోకి సెల్ ఫోన్స్ అనుమతించడం లేదట. స్టాఫ్ తో పాటు అటు హీరోలు కూడా ఫోన్లు తీసుకురావడం లేదని సమచారం.

4a

ఇక ఎన్టీఆర్ లుక్ గురించే ఇప్పుడు అందరు మాట్లాడుకుంటున్నారు. ఎన్టీఆర్ ఈ చిత్రంలో భారీకాయంతో కనిపించబోతున్నాడు. అరవింద సమేతలో సిక్స్ ప్యాక్ తో కనిపించిన ఎన్టీఆర్, ఈ సినిమాలో శరీరాన్ని భారీగా పెంచాడట. దాదాపు వందకేజీలకు పైగా వెయిట్ పెరిగినట్టు తెలుస్తున్నది. ‘వినయ విధేయ రామ’ సినిమా తరువాత రామ్ చరణ్ ను కూడా స్పెషల్ ట్రైనర్ సారథ్యంలో కొత్త మేకోవర్ ను తయారు చేయబోతున్నట్టు సమాచారం. ఈ సినిమా 2020లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu