‘నేను స్టూడెంట్‌ సార్‌’ మూవీ ట్రైలర్‌


బెల్లంకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నేను స్టూడెంట్ సార్’. నాంది నిర్మాత సతీష్ వర్మ నుంచి వస్తోన్న రెండో మూవీ ఇది. ఈ మూవీతో రాకేశ్ ఉప్పలపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా జూన్ 2న విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఈ ట్రైలర్ చూసుకుంటే హీరో అతి కష్టం మీద తనకి ఇష్టమైన ఐ ఫోన్ కొంటాడు. ఆ ఫోన్ కారణంగా అతను అనుకోకుండా ఒక హత్య కేసులో ఇరుక్కుంటారు. సాక్ష్యాలు కూడా అతనే హత్య చేసినట్లు ఉంటాయి. ఈ మర్డర్ కేసులో భాగంగా సుబ్బు అకౌంట్ కి 1.75 కోట్లు ట్రాన్స్ ఫర్ అయ్యాయని ఆధారాలు సృస్టిస్తారు.

తనపై మోపబడిన హత్యానేరం నుంచి పోలీస్ కమీషనర్ తో ఫైట్ చేసి ఎలా బయట పడ్డాడు అనేది ఈ స్టొరీలో భాగంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీస్ కమీషనర్ గా సముద్రఖని నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తున్నట్లు ఉంది. ఈ సినిమాతో భాగ్యశ్రీ కూతురు అవంతిక దాసాని హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుంది. ఈ మూవీకి మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు. స్వాతి ముత్యం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన బెల్లం కొండ గణేష్‌ నటిస్తున్న రెండో సినిమా ఇది. దీంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

CLICK HERE!! For the aha Latest Updates