HomeTelugu Trendingతారక్‌ ఫ్యామిలీ ట్రిప్‌.. ఫొటోలు వైరల్‌

తారక్‌ ఫ్యామిలీ ట్రిప్‌.. ఫొటోలు వైరల్‌

JR ntr off to dubai with fa

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌ ప్రస్తుతం దేవర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన దేవర లుక్‌ నెట్టింట హల్‌ చల్ చేస్తూ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తోంది. తాజాగా ఎన్టీఆర్‌ ఫ్యామిలీతో కలిసి దుబాయ్‌ ట్రిప్ వేశాడు.

ఎయిర్‌పోర్టు ఫొటోలను చూసిన అభిమానులు.. తారక్ ఫ్యామిలీ ట్రిప్ వేశారని తెగ చర్చించుకోవడం మొదలుపెట్టారు. అయితే తారక్ వెళ్లింది వెకేషన్‌కు కాదు.. దుబాయ్‌లో జరిగే ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో పాల్గొననున్నాడు. ఆర్‌ఆర్‌ఆర్‌లో అద్భుతమైన నటనకు ఉత్తమ నటుడి అవార్డును అందుకోనున్నాడు. ట్రిప్‌ టైంలో తారక్‌తో నటి హిమజ దిగిన ఫొటో నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.

ప్రస్తుతం దేవర షూటింగ్‌తో బిజీగా ఉన్న తారక్‌ సైమా అవార్డ్స్‌ కోసం చిత్రీకరణకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చాడు. ఈ సినిమాతో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తుంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌గా భైర పాత్ర పోషిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే చంద్రబాబు అరెస్ట్‌పై ఎన్టీఆర్‌ ఏమీ కామెంట్‌ చేయలేదు. పైగా సడెన్‌గా టూర్‌కి వెళ్తున్నాడు అంటూ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!