HomeTelugu Trendingమెగా ప్రిన్సెస్‌కు ఎన్టీఆర్‌ సర్ ప్రైజ్ గిఫ్ట్ !

మెగా ప్రిన్సెస్‌కు ఎన్టీఆర్‌ సర్ ప్రైజ్ గిఫ్ట్ !

jr ntr special gift for kli
టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్.. రామ్‌ చరణ్‌ గారాల పట్టి క్లీంకారా కు ఓ సర్‌ప్రైజ్‌ గిప్ట్‌ ఇచ్చినట్లు తెలుస్తుంది. మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్ పెళ్లైన చాలా ఏళ్ల తర్వాత తండ్రైన విషయం తెలిసిందే. చరణ్ భార్య ఉపాసన గత నెలలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా మెగా లిటిల్ ప్రిన్సెస్ క్లింకారా కోసం ఎన్టీఆర్ ప్రత్యేకంగా డిజైన్ చేయించిన గోల్డ్ డాలర్స్ ను బహుమతిగా పంపించినట్లు టాక్.

అది కూడా తారక్ పిల్లలు అభయ్, భార్గవ్ రామ్ లు ఎంతో ఇష్టంగా వాటిని అందించినట్లు తెలుస్తోంది. ఆ డాలర్స్ మీద చరణ్, ఉపాసన, క్లింకారాల పేర్లు వచ్చేలా డిజైన్ చేయించినట్లు సమాచారం. ఈ బహుతులు మెగా ఫ్యామిలీకి చాలా బాగా నచ్చినట్లు తెలుస్తోంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో రామ్‌ చరణ్‌- ఎన్టీఆర్‌లు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం తమ తదుపరి చిత్రాల్లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం తారక్.. కొరటాల శివతో ‘దేవర’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో గేమ్ ఛేంజర్ లో నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu