HomeTelugu Trendingభగవద్గీత సాక్షిగా.. సాయి ధరమ్‌ తేజ్‌

భగవద్గీత సాక్షిగా.. సాయి ధరమ్‌ తేజ్‌

Sai Dharam Tej new movie t

సాయి ధరమ్‌తేజ్ ప్రస్తుతం సుబ్బు డైరెక్షన్‌ లో ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. దీని తరువాత ‘దేవకట్టా’ దర్శకత్వంలో మరో సినిమా చేయాల్సివుంది. ఈ క్రమంలో తాజాగా మరో సినిమాని కూడా లైన్లో పెట్టినట్టు తెలుస్తోంది. నూతన దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో వెంటనే ఆ ప్రాజక్టుకి సాయి ధరమ్‌ తేజ్‌ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దీనికి ‘భగవద్గీత సాక్షిగా’ అనే పవర్ ఫుల్ టైటిల్ని పెట్టినట్టు సమాచారం. టైటిల్ని బట్టి చూస్తే, ఇదేదో నేరసంబంధమైన పాయింట్ చుట్టూ కోర్టుల నేపథ్యంలో అల్లిన కథలా అనిపిస్తోంది. దేవ కట్టా సినిమా తర్వాత ఈ కొత్త సినిమా సెట్స్ పైకి తీసుకు వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారట. దీని గురించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడనున్నట్లు తెలుస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu