HomeTelugu Trending'ఆర్‌ఆర్‌ఆర్' ఎన్టీఆర్‌కు హీరోయిన్‌ దొరికిందా!

‘ఆర్‌ఆర్‌ఆర్’ ఎన్టీఆర్‌కు హీరోయిన్‌ దొరికిందా!

7 18దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్‌ మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్’‌. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌లు హీరోలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రాని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. పీరియాడిక్‌ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్‌చరణ్‌కు జోడిగా బాలీవుడ్ నటి అలియా భట్‌ నటిస్తున్నారు.

ఎన్టీఆర్‌కు జోడిగా హాలీవుడ్ నటి డైసీ ఎడ్గర్‌ జోన్స్‌ నటిస్తుందని ప్రకటించినా వ్యక్తిగత కారణాలతో ఆమె సినిమా నుంచి తప్పుకున్నారు. అప్పటి నుంచి ఎన్టీఆర్‌కు హీరోయిన్‌గా విదేశీ భామ కోసం వేట సాగిస్తున్నారు ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రబృందం. తాజాగా ఎన్టీఆర్‌ సరసన నటించబోయే హీరోయిన్‌ ఫైనల్‌ అయినట్టుగా తెలుస్తోంది.

చిత్రయూనిట్ అధికారికంగా వెల్లడించకపోయినా హాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఓ బ్రిటీష్ భామ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించనుందని తెలుస్తోంది. వచ్చే నెలలో ఆ భామ ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌లో కూడా జాయిన్‌ అవుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ భామ ఎవరు..? అన్న విషయం తెలియాలంటే మాత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ టీం నుంచి అధికారికంగా ప్రకటించే వరకు ఎదురు చూడాల్సిందే

Recent Articles English

Gallery

Recent Articles Telugu