HomeTelugu Trendingసలార్‌: ప్రభాస్‌ సోదరిగా జ్యోతిక!

సలార్‌: ప్రభాస్‌ సోదరిగా జ్యోతిక!

Jyothika as Prabhas sister
యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ వరుస సినిమాలతో బీజిగా ఉన్నాడు. ప్రభాస్‌ నటిస్తున్న తాజా చిత్రం సలార్. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిన్నటివరకు ప్రభాస్ – శృతిహాసన్ క్యారెక్టర్స్ గురించి పుకార్లు వైరల్ అయ్యాయి. ఇప్పుడు సలార్ సినిమాలో ప్రభాస్ సోదరి పాత్ర గురించి వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ సోదరిగా ఇంతవరకు ప్రముఖ నటి రమ్యకృష్ణ పేరు వినిపించిన సంగతి తెలిసింది. కానీ ఇప్పుడు జ్యోతిక పేరు వినిపిస్తుంది. ప్రభాస్‌ సోదరి పాత్ర కోసం జ్యోతికని సంప్రదించినట్లు సమాచారం. ఆల్రెడీ జ్యోతికకు మేకర్స్ స్క్రిప్ట్ కూడా వినిపించడం జరిగిందట. తెలుగు తమిళం వరకు జ్యోతికను తీసుకుంటున్నారని.. కన్నడ వెర్షన్ లో మాత్రం ప్రియాంక త్రివేదిని సంప్రదించినట్లు వినికిడి.

మరి ఈ పాత్రలకు అంగీకరించారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమాను కేజీఎఫ్ ప్రొడ్యూసర్ విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ తోతో ఫస్ట్ టైం శృతిహాసన్ జోడికడుతోంది. హై వోల్టెజ్ మాస్ ఫిల్మ్ కావడంతో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయెల్ రోల్ చేస్తున్నాట్లు వార్తలు వస్తున్నాయి

Recent Articles English

Gallery

Recent Articles Telugu