పీకల్లోతు ప్రేమలో కైరా అద్వానీ

కైరా అద్వానీ పీకల్లోతు ప్రేమలో ఉందట. బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రతో ఆమె డేటింగ్ చేస్తుందట. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని, వీరిద్దరినీ కలిపేందుకు ప్రముఖ దర్శకుడు కరణ్ జోహర్ రంగంలోకి దిగుతున్నట్లు బాలీవుడ్‌‌లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

“భరత్ అనే నేను” సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది కైరా అద్వానీ. సిద్ధార్థ్ మల్హోత్రతో డేటింగ్ వార్తలను కైరా ఖండించినా.. చాలా సందర్భాల్లో వీరిద్దరూ డేటింగ్ చేస్తూ కంటబడ్డారు. అంతేకాదు, వీరిద్దరూ ఏకాంతంగా కలుసుకునేందుకు కరణ్ జోహార్ ఇంటినే వాడుకుంటున్నట్లు తెలిసింది. ఇటీవల “కాఫీ విత్ కరణ్” కార్యక్రమానికి వచ్చిన సిద్దార్థ్ మాజీ ప్రేయసి అలియా భట్ కూడా ఈ విషయాన్ని వెల్లడించడం గమనార్హం. సిద్ధార్థ్ ఎవరితో డేటింగ్ చేయడానికి ఇష్టపడతాడని కరణ్ అడిగిన ప్రశ్నకు ఆమె కైరా అద్వానీ అని సమాధానం ఇచ్చింది. దీంతో సిద్ధార్థ్, కైరా రిలేషన్ నిజమేనని తేలిపోయింది. దీంతో కైరా కూడా త్వరలో పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే, ఆమె తన కెరీర్‌కే తొలి ప్రాధాన్యమని, ఇతర విషయాల జోలికి పోనని స్పష్టం చేస్తోంది.