HomeTelugu Trendingకాజల్ రీఎంట్రీపై స్పష్టత వచ్చేసిందిగా

కాజల్ రీఎంట్రీపై స్పష్టత వచ్చేసిందిగా

kajal agarwal reentry
కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కాజల్ ఓ పిల్లాడికి తల్లి కూడా అయింది. స్టార్ హీరోయిన్‌గా ఫామ్‌లో ఉన్నప్పుడే వైవాహిక జీవితంలో అడుగుపెట్టింది కాజల్. అయితే ఈ అమ్మడి సెకండ్ ఎంట్రీ గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన రీఎంట్రీపై నోరువిప్పింది కాజల్ అగర్వాల్.

విశ్వనటుడు కమల్ హాసన్ భారతీయుడు సీక్వెల్‌లో కాజల్ నటించబోతున్నట్టు తెలిపింది. ప్రముఖ దర్శకుడు శంకర్, కమల్‌హాసన్ కాంబినేషన్‌లో వచ్చిన భారతీయుడు సినిమా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్ ఎప్పటినుంచో వాయిదా పడుతూ వస్తోంది.

భారతీయుడు సీక్వెల్ షూటింగ్ జరుగుతున్న సమయంలో ప్రమాదం జరగడం వల్ల ముగ్గురు టెక్నీషియన్లు చనిపోవడంతో సినిమా చిత్రీకరణ రెండేళ్లుగా నిలిచిపోయింది. ఇప్పుడు తాజాగా సెప్టెంబర్ నుంచి షూటింగ్ మొదలు పెట్టనున్నట్టు తెలుస్తోంది. ఇండియన్-2 పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటివరకు 60 శాతం పూర్తయినట్టు సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu