HomeTelugu Trendingకన్నడలో ఎంట్రీ ఇవ్వబోతున్న కాజల్ అగర్వాల్

కన్నడలో ఎంట్రీ ఇవ్వబోతున్న కాజల్ అగర్వాల్

10 22
లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పంజాబీ భామ కాజల్ అగర్వాల్. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన కాజల్ తెలుగు టాప్ హీరోలందరితో కలిసి నటించి మెప్పించింది. కాజల్ సౌత్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. టాలీవుడ్, కోలీవుడ్ రంగంలో మెరుపులు మెరిపించిన కాజల్ తన కెరీర్లో 50 సినిమాలను పూర్తి చేసింది.
పదేళ్ల క్రితం ఎంట్రీ ఇచ్చిన కాజల్ కు ఈ మధ్య తెలుగులో అవకాశాలు తగ్గిపోవడంతో శాండల్‌వుడ్‌పై దృష్టి పెట్టింది. కన్నడంలో తొలిసినిమా చేయబోతుంది కాజల్. కన్నడంలో ఉపేంద్ర హీరోగా చేస్తున్న ఓ సినిమాలో హీరోయిన్‌గా చేయబోతుంది. గతంలో నయనతార, త్రిష లాంటి హీరోయిన్లు కన్నడ రంగంలో రాణించాలని చూశారు. కానీ, ఆ హీరోయిన్ల సినిమాలు పెద్దగా హిట్ కాలేదు. అయితే, ఇప్పుడు కాజల్ అగర్వాల్ ఉపేంద్ర హీరోగా చేస్తున్న సినిమా ద్వారా శాండల్‌వుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతుంది. మరి కన్నడలో ఈ అమ్మడు సక్సెస్ అవుతుందేమో చూద్దాం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu