HomeTelugu Trendingఆదివాసీ యువతి పాత్రలో కాజల్ అగర్వాల్

ఆదివాసీ యువతి పాత్రలో కాజల్ అగర్వాల్

Kajal Agarwal huge remunera
దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి ఈ సామెత హీరోయిన్లకు బాగా సరిపోతుంది. ఎందుకంటే ఒకప్పుడు హీరోయిన్లయితే దశాబ్దాల పాటు చిత్రసీమలో పాతుకుని ఉండేవారు కానీ ఇప్పుడు ఎంత టాప్ హీరోయిన్ అయినా ఎంతకాలం అవకాశాలు ఉంటాయో చెప్పలేం. అందుకే అవకాశాలు ఉన్నప్పుడే సంపాదించి పెట్టుకోవాలి. అందుకే ఇప్పటి హీరోయిన్లు ఏ రోల్ అయినా తమ డిమాండ్‌ను బట్టి నిర్మాత నుంచి పారితోషికం బాగానే రాబడుతున్నారు. తాజాగా అందాల చందమామ కాజల్ కూడా ఓ గెస్ట్ రోల్‌కోసం పారితోషికం భారీగా వసూలు చేసినట్టు తెలుస్తోంది.

కాజల్ అగర్వాల్ అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో ఐటమ్‌ సాంగ్స్‌తో పాటు, గెస్ట్‌ రోల్స్ కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. యువ నటులతో పాటు సీనియర్‌ యాక్టర్లతో కూడా కాజల్‌ జత కట్టింది. చాలామంది హీరోలు, హీరోయిన్స్‌, డైరెక్టర్లతో కాజల్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. రానా హీరోగా రూపొందుతున్న హాథీ మేరీ సాథీ చిత్రంలో కాజల్ ఓ గెస్ట్ రోల్ చేసింది. ఇందులో కాజల్ ఆదివాసీ యువతి పాత్ర పోషిస్తోంది. వాళ్ల సంప్రదాయం ప్రకారం ఈ సినిమాలో బ్లౌజ్‌ లేకుండా చీరకట్టులో కనిపించనుందట. అరగంట పాటు ఉండే తన పాత్రకు రూ. 70 లక్షల వరకు వసూలు చేసిందని చెప్తున్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళంలో తెరకెక్కుతోంది. కాజల్ చేతిలో మరో నాలుగైదు ప్రాజెక్టులు ఉన్నాయి. ఇండియన్ 2లో కీలక పాత్రలో నటిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu