HomeTelugu Trendingఅజయ్‌ దేవగణ్‌తో మరోసారి జోడీగా కాజల్

అజయ్‌ దేవగణ్‌తో మరోసారి జోడీగా కాజల్

  • Kajal with Ajay Devgan
  • సింగం సినిమాతో బాలీవుడ్‌లో తొలిసారి అజయ్‌దేవగణ్‌తో జత కట్టింది చందమామ కాజల్ అగర్వాల్. పదేళ్ల తర్వాత మళ్లీ వీరిద్దరూ జంటగా మరో సినిమాలో నటించబోతున్నట్టు తెలుస్తోంది. తమిళంలో కార్తి హీరోగా నటించిన ఖైదీ చిత్రం పెద్ద విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నట్లు అజయ్ దేవగణ్ గతంలోనే ప్రకటించారు. అజయ్ సరసన కాజల్ హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు సమాచారం. బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కథలో కాస్త మార్పులు చేస్తున్నారట. ఇందులో కాజల్ పాత్ర కీలకం కాబోతుందట. ఈ సినిమాలో నటించడానికి కాజల్‌ ఓకే చేసినట్లు సమాచారం. లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో త్వరలోనే షూటింగ్ ప్రారంభించబోతున్నారట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu