HomeTelugu Trendingక్రిస్మస్‌కు రానున్న 'పుష్ప'

క్రిస్మస్‌కు రానున్న ‘పుష్ప’

pushpa movie part 1 release
అల్లు అర్జున్‌ – సుకుమార్‌ కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. రెండు భాగాలుగా భారీ అంచనాల నడుమ ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న అభిమానుల నిరీక్షణకు తెరపడింది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఈ సినిమా తొలి భాగం డిసెంబరులో క్రిస్మస్‌ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్‌ని పంచుకుంది చిత్ర బృందం. ‘‘పుష్ప పార్ట్‌ 1’ ఈ డిసెంబరులో.. తగ్గేదే లే’’ అని పేర్కొంది. పాన్‌ ఇండియా మూవీగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రూపొందుతోంది. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో రానుంది. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా, ఫాహద్‌ ఫాజిల్‌ విలన్‌గా నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ముందుగా ఈ చిత్రాన్ని ఆగస్టులో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ, కరోనా కారణంగా చిత్రీకరణ వాయిదా పడటంతో డిసెంబరుకి వాయిదా వేశారు. ఈ సినిమాలోని తొలిగీతం ఆగస్టు 13న విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu