HomeTelugu Trendingకాజల్‌ జంట హనీమూన్‌ ప్రయణం

కాజల్‌ జంట హనీమూన్‌ ప్రయణం

Kajal and gautam
టాలీవుడ్‌ బ్యూటీ కాజల్ అగర్వాల్ ఇటీవలే గౌతమ్ ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. సంసార జీవితంలోకి ప్రవేశించిన ఈ భామ పెళ్లి తర్వాత కూడా సినిమాలలో నటిస్తానని ఇప్పటికే చెప్పింది. ఇక కరోనా నేపథ్యంలో సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా వివాహాన్ని జరుపుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు భర్తతో కలసి హనీమూన్ ఎంజాయ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఇన్ స్టాగ్రామ్ లో ఈ రోజు చిన్న హింట్ ఇచ్చింది ఈ చందమామ. బ్యాగేజి, పాస్ పోర్టుల ఫొటోలు పోస్ట్ చేసి.. ‘బ్యాగులు సర్దుకున్నాం’.. ‘బయలుదేరడానికి సిద్ధంగా వున్నాం’ అంటూ ఆ ఫొటోలపై క్యాప్షన్స్ ఇచ్చింది. హనీమూన్ కి వెళుతున్న విషయాన్ని అలా చెప్పకనే చెప్పేసిందన్నమాట. అయితే, ఏ ప్రదేశానికి వెళుతున్నదీ తెలియలేదు. నెటిజన్ల ‘హ్యాపీ జర్నీ’ అంటూ కాజల్ జంటకు విషెస్ చెబుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu