HomeTelugu Trendingకొత్త సినిమా సంతకం చేసిన కాజల్‌

కొత్త సినిమా సంతకం చేసిన కాజల్‌

Kajal aggarwal signs new mo
టాలీవుడ్ చందమామ కాజ‌ల్ పెళ్లి తరువాత కూడా వరుస సినిమాలు చేస్తుంది. తాజాగా ఉమ టైటిల్‌తో తెర‌కెక్కనున్న ఓ సినిమాకు సంత‌కం చేసింది కాజ‌ల్‌. ప‌రిస్థితులు మెరుగైన వెంట‌నే ఈ మూవీ షూటింగ్ మొద‌లు పెట్టాల‌నుకుంటున్నారు. ఫ‌న్‌, ఎంట‌ర్ టైనింగ్ సినిమాలు చేసేందుకు ఎప్పుడూ సిద్దమే. ఫ‌న్, ఎంట‌ర్ టైనింగ్ ఓ యాక్ట‌ర్ గా నాకు ఇప్ప‌టికీ ఛాలెంజింగ్ లా అనిపిస్తుంది.

ఉమ చిత్రంలో న‌టిస్తున్నాన‌ని చెప్తున్నందుకు చాలా ఎక్జ‌యిటింగ్ గా ఉందని కాజ‌ల్ ఈ సంద‌ర్భంగా చెప్పుకొచ్చింది. ఇది పెళ్లి నేపథ్యంలో ఫ్యామిలీ డ్రామా కథాంశంతో తెరకెక్కనుంది. పూర్వీకులకు చెందిన పాత కాలం ఇంట్లో పెళ్లి ఏర్పాట్లు జరుగుతుండగా ఒక అపరిచితురాలైన ఉమా రాకతో ఇంట్లో ఎలాంటి ట్విస్టు బయటపడింది? అన్నది తెరపై చూడాల్సిందే. త‌థాగ‌త సింఘ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తున్నాడు. అవిషేక్ ఘోష్ నిర్మిస్తున్నారు. ఈ ఏడాది మధ్యలో షూటింగ్ మొద‌లు పెట్టి చిత్రీక‌ర‌ణ పూర్తి చేయ‌నున్నారు. కోవిడ్ ప్రొటోకాల్స్ అన్ని పాటిస్తూనే చిత్రీక‌ర‌ణ కొన‌సాగ‌నుంది. ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu