HomeTelugu Trendingపవన్‌ కళ్యాణ్‌ సినిమాలో నటించడం లేదు: మాళవిక మోహనన్‌

పవన్‌ కళ్యాణ్‌ సినిమాలో నటించడం లేదు: మాళవిక మోహనన్‌

 

malavika Mohanan clarifies

పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలతో మరోవైపు పొలిటిక్స్‌లో బిజీగా ఉన్నారు. తేరి రీమేక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక దర్శకుడు హరీష్ శంకర్ దాని కోసం గబ్బర్ సింగ్ తరహాలో కొన్ని కీలక మార్పులు చేసుకుని స్క్రిప్ట్ సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. కాకపోతే మెయిన్ లైన్ మాత్రం మార్చకుండా కేవలం ట్రీట్ మెంట్ లోనే తేడాలుండేలా జాగ్రత్త పడుతున్నాడట. ఇక ఈ సినిమాలో పవన్‌కు జంటగా ఇద్దరు హీరోయిన్‌లు అలరించనున్నారు. అందులో ఒక హీరోయిన్‌గా శ్రీలీల లాక్ అయిన సంగతి తెలిసిందే.

తాజాగా మాళవిక మోహనన్ ని సెంకడ్‌ హీరోయిన్‌గా ఫిక్స్‌ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నారు. ఒరిజినల్ వెర్షన్ ఫ్లాష్ బ్యాక్ లో సమంతా క్యారెక్టర్ చనిపోతుంది. అది జరిగాకే విజయ్ పోలీస్ ఉద్యోగం వదిలేసి వేరే చోట బేకరీ పెట్టుకుని జీవనం సాగిస్తాడు. అక్కడ స్కూల్ టీచర్ గా పని చేస్తున్న అమీ జాక్సన్ అతన్ని ఇష్టపడి కోరుకుంటుంది. క్లైమాక్స్ లో వాళ్ళు కలిసినట్టు పెళ్లైనట్టు చూపించకుండా వదిలేశాడు అట్లీ. ఇక్కడ సామ్ ప్లేసులోనే మాళవికను తీసుకున్నట్టు టాక్‌ వచ్చింది. కానీ మాళవిక మాత్రం ఈ ప్రాజెక్టులో తాను లేనని ట్విట్టర్ లో అఫీషియల్ క్లారిటీ ఇచ్చింది.

malavika Mohanan 1

ఇక ప్రస్తుతం తెలుగులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి జోడీగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో మాళవిక మోహనన్ నటిస్తుంది. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఇక పవన్ గురించి ప్రచారం ఎలా ఎక్కడి నుంచి మొదలైందో కానీ మొత్తానికి గంటల్లోనే వార్త వైరల్ అయ్యింది. మాములుగా ప్రొడక్షన్ హౌసులు ఖండించే ఇలాంటి న్యూస్ ని స్వయంగా హీరోయినే స్పష్టత ఇవ్వడం విశేషం. టాలీవుడ్ డెబ్యూ గురించి ఎగ్జైటింగ్ గా ఉన్నానని పవన్ పట్ల ఎంతో గౌరవముందని అయితే తేరి రీమేక్ లో మాత్రం భాగం కాలేదని చెప్పింది ఈ హీరోయిన్‌.

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu