HomeTelugu Trendingకాజల్‌తో అల్లు అర్జున్‌ స్పెషల్ సాంగ్‌

కాజల్‌తో అల్లు అర్జున్‌ స్పెషల్ సాంగ్‌

6 20డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ కంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘అల వైకుంఠపురములో’. ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది . సుశాంత్‌, టబు, నవదీప్‌, జయరామ్‌, నివేదా పేతురాజ్‌లు ఈ మూవీలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.

ఈ సినిమాలో ఓ ప్రత్యేక గీతంలో టాలీవుడ్ చందమామ కాజల్‌ అగర్వాల్ నర్తించనున్నారట. గతంలో జనతా గ్యారేజ్‌ సినిమాలో ఎన్టీఆర్‌తో స్పెషల్ సాంగ్‌లో నటించిన కాజల్‌, ఇప్పుడు బన్నీతో కలిసి ఆడిపాడేందుకు సిద్ధం అవుతున్నారు. హారిక హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా 2020 సంక్రాంతికి విడుదలకానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu