రాజశేఖర్‌ ‘కల్కి’ టీజర్‌.. విజువల్ వండర్

ప్రముఖ నటుడు రాజశేఖర్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘కల్కి’. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. అదా శర్మ, స్కార్లెట్‌ మెల్లిష్‌ విల్సన్‌, నందితా శ్వేత, పూజిత పొన్నాడ, నాజర్‌, రాహుల్‌ రామకృష్ణ, అశుతోష్‌ రాణా తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సంబంధించిన మరో టీజర్‌ను బుధవారం విడుదల చేశారు. టీజర్‌ మొత్తంలో నేపథ్య సంగీతం హైలైట్‌గా నిలిచింది. శివానీ-శివాత్మిక మూవీస్‌ బ్యానర్‌పై రాజశేఖర్‌ కుమార్తెలు శివానీ, శివాత్మికలతో పాటు సి. కల్యాణ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రవణ్‌ భరద్వాజ్‌ సంగీతం ఈ సినిమాకి అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ మూవీని మే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమాకు సంబంధించి 30 శాతం షూటింగ్‌ మిగిలి ఉందని చిత్ర బృందం పేర్కొంది.‌