సీత కోసం కాజల్ ఏం చేసిందో తెలుసా?

కాజల్ అగర్వాల్, బెల్లంకొండ శ్రీనివాస్‌ జంటగా నటిస్తున్న చిత్రం సీత. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం కోసం కాజల్ చాలా కష్టపడిందట. మన్నారా చోప్రా, సోనూసూద్‌ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. అనూప్‌ రూబెన్స్‌ బాణీలు అందించిన ఈ సినిమా మే 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా కాజల్‌ సినిమా విశేషాలు మీడియాతో పంచుకున్నారు.

నవతరం అమ్మాయిల జీవితాలను ప్రతిబింబించే పాత్ర సీత. తను కన్న కలలను సాధించుకోవాలనే తపన ఉండే అమ్మాయి పాత్ర. అదేవిధంగా తనకు స్వార్థం ఎక్కువ. సీత నటనకు ఆస్కారం ఉండే పాత్ర. తేజ సర్‌ సినిమాల్లో నాకు ప్రతిసారీ నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర దొరుకుతోంది. సీత పాత్రలో నటించడం, దాన్ని అర్థం చేసుకోవడం కష్టమే. ఇందు కోసం చాలా పుస్తకాలను చదివా, పలువుర్ని పరిశీలించానని తెలిపింది కాజల్. ఈ సినిమా కోసం కొన్ని సాహసాలు కూడా చేయాల్సి వచ్చింది. 200 కేజీల బరువున్న ఐస్‌ గడ్డల్ని నాపై వేసుకుని నటించాను అన్నారు. కొన్ని రియల్‌ ఫైట్లు కూడా చేసినట్లు తెలిపింది.

తనకు పౌరాణికాలంటే చాలా ఇష్టమని కానీ ఇందులోని పాత్ర అలా ఉండదని తెలిపింది. ఇది పూర్తిగా నేటి తరం కథ. నా పాత్ర ఎలా ఉంటుందో.. బెల్లంకొండ శ్రీనివాస్‌ పాత్ర కూడా అంతే బాగుంటుందని తెలిపింది. మేమిద్దరం కవచం సినిమాలో కలిసి నటించాం. అది ఈ సినిమాకు మేలు చేసిందని తెలిపింది.