HomeTelugu Big Storiesఈతరం హీరోయిన్స్ శ్రీలీలను చూసి అది నేర్చుకోవాలి: కాజల్‌

ఈతరం హీరోయిన్స్ శ్రీలీలను చూసి అది నేర్చుకోవాలి: కాజల్‌

Kajal interesting comments

నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం ‘భగవంత్ కేసరి’. ఈ సినిమా అక్టోబర్‌ 19న దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్‌ హీరోయిన్ గా నటించగా.. కీలక పాత్రలో శ్రీలీల నటించింది. బాలయ్య, శ్రీలీల కాంబో సన్నివేశాలు సినిమాకే హైలైట్‌ అని టాక్‌.

సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో.. మూవీ యూనిట్‌ వరుస ఇంటర్వ్యూలతో సందడి చేస్తున్నారు. తాజాగా హీరోయిన్ కాజల్‌ అగర్వాల్‌ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీలీల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తెలివిగా కష్టపడుతున్న శ్రీలీల కి మంచి భవిష్యత్తు ఉంది అంటూ కాజల్ అగర్వాల్‌ అభిప్రాయం వ్యక్తం చేసింది.

ఏదైనా పనిని ఛాలెంజ్ గా తీసుకుంటే కచ్చితంగా దాన్ని సాధిస్తాం. శ్రీలీల లో ఆ క్వాలిటీని నేను చేశాను. తాను ఏదైనా కోరుకుంటే సాధించి తీరుతుంది. చాలా తెలివైనది, అలాగే చాలా కష్టపడే మనస్తత్వం. ప్రతి ఒక్కరితో కూడా చాలా విధేయంగా ఉంటూ అందరి హృదయాలను గెలుచుకుంటూ ఉంది. చాలా ప్లానింగ్ తో శ్రీలీల కనిపిస్తూ ఉంటుంది.

శ్రీలీల సెట్‌ లో ఉంటే చాలా సరదాగా ఉంటుంది. తనతో కలిసి వర్క్ చేయడం చాలా సంతోషంగా అనిపించింది. అందరితో కలిసి పోవడం అనేది ఈతరం హీరోయిన్స్ ఎక్కువగా నేర్చుకోవాల్సిన విషయం అన్నట్లుగా కాజల్‌ చెప్పుకొచ్చింది. మొత్తానికి శ్రీలీల పై ఇంతకు ముందు బాలయ్య ప్రశంసల వర్షం కురిపిస్తే ఇప్పుడు కాజల్‌ వంతు అయింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu