కాజల్‌కు ఏమైంది..ఆ ఫొటోలేంటి?

హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌కు ఏమైంది? సామాజిక మాధ్యమాల్లో అభిమానులు గుప్పిస్తున్న ప్రశ్నలివి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా కాజల్‌ తన ట్విటర్, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల్లో బ్లాంక్‌గా ఉన్న ఫొటోలను పోస్ట్‌ చేస్తున్నారు. అది కూడా గోధుమ రంగు బ్యా‌గ్రౌండ్‌ ఉన్న ఫొటోలను మాత్రమే పోస్ట్‌ చేస్తున్నారు. అంతేకాదు.. ‘క్విక్‌ రిమైండర్‌.. ఐలవ్యూ’ అన్న ఫొటోను కూడా పోస్ట్‌ చేశారు. అయితే ఈ ఫొటోలకు ఎలాంటి క్యాప్షన్‌లు ఇవ్వడంలేదు. దాంతో అభిమానులు కామెంట్స్ బాక్స్‌లో తెగ ప్రశ్నలు గుప్పిస్తున్నారు. అసలు కాజల్‌కు ఏమైంది? ఆ ఫొటోలేంటి? వాటికి అర్థమేంటి? ఏదన్నా శుభవార్త చెప్పాలనుకుంటున్నారా? అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే వీటిపై కాజల్‌ ఇప్పటివరకు స్పందించింది లేదు.

 

ప్రస్తుతం కాజల్‌.. ‘భారతీయుడు 2’ సినిమాలో నటిస్తున్నారు. కమల్‌ హాసన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో పాటు కాజల్‌ మరో మూడు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. మరోపక్క కాజల్‌ నిర్మాతగా కొత్త ప్రయాణాన్ని కూడా ప్రారంభించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. దర్శకుడు ప్రశాంత్‌ వర్మ తెరకెక్కిస్తున్న ఓ సినిమాలో కాజల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారని, ఈ సినిమాకు‌ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారని టాలీవుడ్‌ వర్గాల సమాచారం. ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన ‘అ’ సినిమాలో కాజల్‌ మెయిన్‌ రోల్‌లో నటించారు.

View this post on Instagram

💕

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on