HomeTelugu Trendingవెబ్‌సిరిస్‌లో మరింత గ్లామర్‌గా చందమామ..

వెబ్‌సిరిస్‌లో మరింత గ్లామర్‌గా చందమామ..

Kajal to act in quantico re

టాలీవుడ్‌ చంమామ కాజల్ అగర్వాల్ త్వరలో ఓ హాట్ క్యారెక్టర్ లో నటించనుంది. ఇన్నాళ్లు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు చిత్రాలలో గ్లామర్ తారగా రాణించిన ఈ అమ్మడు ఇప్పుడు తన గ్లామర్ ని డిజిటల్ ప్లాట్ ఫార్మ్ కి కూడా విస్తరిస్తోంది. ఇప్పటికే పలువురు స్టార్స్‌ వెబ్ సీరీస్ లో నటిస్తుండగా.. ఇప్పడు కాజల్‌ కూడా రెడీ అవుతోంది. అయితే, తను చేసే వెబ్ సీరీస్‌లో ఈ బ్యూటీ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ని పోషించనుంది.

ఆమధ్య బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో ‘క్వాంటికో’ అనే సీరీస్ లో నటించిన సంగతి తెలిసిందే. అందులో ఆమె హాట్ హాట్ గా కనిపించి సంచలనం సృష్టించింది. అలాగే ఆమె పెర్ఫార్మెన్స్ కి అక్కడ ప్రశంసలు కూడా లభించాయి. ఈ వెబ్ సీరీస్ అక్కడ బాగా సక్సెస్ కావడంతో దీనికి ఇండియన్ వెర్షన్ నిర్మించడానికి నెట్ ఫ్లిక్స్ సన్నాహాలు చేస్తోంది. ఈ సీరీస్ కి ప్రియాంక పాత్రకి కాజల్ అగర్వాల్ ని ఎంచుకున్నారు. కాగా.. ఈ సీరీస్ ద్వారా కాజల్ మరింత గ్లామర్ గా కనిపించనుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu