పవన్‌ కళ్యాణ్ ఈజ్‌ బ్యాక్‌

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల తరువాత గెటప్ మార్చాడు. ఎన్నికల సమయంలో తెల్లపైజామా, పంచె మాత్రమే కట్టుకొని కనిపించిన పవన్, ఇప్పుడు సడెన్ గా ప్యాంటు షర్ట్ వేసుకొని కనిపించి కనువిందు చేశాడు. బ్లూ కలర్ జీన్స్ షర్ట్ వేసుకున్న పవన్, గెడ్డం మాత్రం తీయకుండా అలాగే ఉంచేశాడు. సినిమా కోసమే పవన్ తన స్టైల్ ను మార్చుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

ఎన్నికల్లో పోటీ చేసిన పవన్ రెండు స్థానాల్లో ఓటమి పాలవ్వడాన్ని ఆయన అభిమానులు జీర్చించుకోలేకపోతున్నారు. గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. జనసేన పార్టీ 132 స్థానాల్లో పోటీ చేయగా కేవలం ఒకే ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించింది.