ఈ బ్యూటీకి యాక్షన్ సీన్స్ చేయాలనుందట!

బాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన కాజోల్ కి అక్కడ ప్రేక్షకుల్లో సుస్థిర స్థానాన్ని
సంపాదించుకుంది. ఒకప్పుడు ఆమె సినిమా రిలీజ్ అవుతుందంటే ఎగబడి థియేటర్లకు వెళ్ళే ప్రేక్షకులు
ఉన్నారు. కొంతకాలం తరువాత అజయ్ దేవగన్ ను వివాహం చేసుకున్న కాజోల్ సినిమాలకు కాస్త గ్యాప్
ఇచ్చింది. తరువాత అప్పుడప్పుడు స్క్రీన్ పై కనిపిస్తూ వస్తోంది. అయితే తాజాగా తనకు యాక్షన్ పాత్రలో
నటించాలనుందని తన మనసులో మాటను చెప్పుకొచ్చింది. ప్రేమించే అమ్మాయిగా, బాధ్యత గల భార్యగా
ఇలా ఎన్నో పాత్రల్లో కనిపించిన కాజోల్ ఇప్పటివరకు యాక్షన్ సినిమాల్లో నటించలేదు. కానీ ఇప్పుడు ఆ
కోరిక తీర్చుకోవాలనుందని చెబుతోంది. నాకు యాక్షన్ సినిమాలో నటించాలనుంది కానీ బద్దకం బాగా ఎక్కువ..
స్టంట్స్ చేసే వాళ్ళ కోసం తీసుకొనే భద్రతా ఏర్పాట్లు, నటులకి అమర్చే తాళ్లు అవన్నీ ఊహించుకుంటుంటే చాలా
కష్టం అనిపిస్తుంటుంది. అలాంటి సన్నివేశాల్లో నన్ను నేను ఊహించుకోలేను కానీ ఆ అనుభవం పొందడానికి
అటువంటి తరహా సినిమాల్లో నటించాలనుంది అంటూ చెప్పుకొచ్చింది. మరి కాజోల్ కి ఆ అవకాశం ఎవరు
ఇస్తారో.. చూడాలి!