HomeTelugu NewsKalki2898AD: ఇటలీలో ఆటా పాటా..

Kalki2898AD: ఇటలీలో ఆటా పాటా..

Kalki 2898 Ad shooting upda
Kalki2898AD: పాన్‌ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమా మరో రెండు నెలల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికీ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ప్రస్తుతం కల్కి టీం ఇటలీలో ఉంది. తాజాగా చిత్రయూనిట్ ఓ ఫోటోను షేర్‌ చేసింది. ఇటలీలో ఆటా పాటా అంటూ అప్డేట్ ఇచ్చింది. ప్రభాస్, దిశా పటానిల మీద సాంగ్ షూట్ చేస్తున్నట్టుగా హింట్‌ ఇచ్చారు.

ఈ ఫోటోలో నాగ్ అశ్విన్, ప్రభాస్, స్వప్నా దత్, దిశా పటానీ వంటి వారు కనిపిస్తున్నారు. కాగా ఈ సినిమా మే 9న విడుదల చేయనున్నారు. మే 9 అనేది వైజయంతీ మూవీస్‌కు అచ్చొచ్చిన డేట్ అన్న సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ తీసిన మహానటి మూవీ కూడా అదే తేదీని వచ్చి క్లాస్ హిట్‌గా క్లాసిక్‌గా నిలిచిపోయింది.

కల్కి 2898 ఏడీ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటుగా దీపిక పదుకొణె, అమితాబ్ బచ్చన్ వంటి వారు నటిస్తున్నారు. కమల్ హాసన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సీక్వెల్స్ ఉంటాయని కూడా తెలుస్తోంది. మరి నాగ్ అశ్విన్ ఏం ప్లాన్ చేశాడో చూడాలి.

ప్రస్తుతం ప్రభాస్‌ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. సలార్ 2, కల్కి, రాజా సాబ్‌ల సినిమాల షూటింగ్‌ పూర్తైన తరువాత సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ సినిమాను పట్టాలెక్కిస్తాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu