HomeTelugu Trendingకన్నడలోకి.. చిరు చిన్నల్లుడు!

కన్నడలోకి.. చిరు చిన్నల్లుడు!

11 18మెగాస్టార్‌ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ ‘విజేత’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఆయన రెండవ సినిమాగా ‘సూపర్ మచ్చి’ రూపొందుతోంది. పులి వాసు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో, రియా చక్రవర్తి .. రచితా రామ్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.

ఈ సినిమాను తెలుగుతో పాటు కన్నడలోను విడుదల చేయనున్నారు. ఈ కారణంగానే కన్నడ సుందరి అయిన రచితా రామ్ ను తీసుకున్నారని అంటున్నారు. ఈ సినిమా తెలుగుతో పాటు కన్నడలోను విజయాన్ని సాధిస్తుందనే నమ్మకంతో కల్యాణ్ దేవ్ వున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన మరో ప్రాజెక్టుకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. శ్రీధర్ సీపాన ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu