HomeTelugu Trendingవిడుదలకు రెడీ అయిన 'సూపర్‌మచ్చి'

విడుదలకు రెడీ అయిన ‘సూపర్‌మచ్చి’

Super Machi movie ready f
మెగాస్టార్‌ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ నటిస్తున్న తాజా చిత్రం సూపర్‌మచ్చి. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని, ఆ తరువాతి కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. తన ఫస్ట్‌ కాపీను రెడీ చేసుకొని విడుదలకు సిద్దంగా ఉంది. ఈవేసవి కాలంలో విడుదల చేయాలనుకున్న చిత్ర బృందాని కరోనా కారణంగా ఎదురు దెబ్బ తగిలింది. లాక్‌డౌన్ మొదట్లో మూడు వారల షూటింగ్‌తో సినిమా పూరైంది. ప్రస్తుతం థియేటర్ల రీఓపెన్ కోసం చిత్ర యూనిట్ ఎదురు చూస్తుంది. కేంద్రం థియేటర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల ఇంకా తెరుచుకోలేదు. ఓటీటీ ఆఫర్లు వస్తున్నా చిత్ర యూనిట్ వాటిని తిరస్కరిస్తోంది. మరి ఈ సినిమా అయినా మెగా అల్లుడికి బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu