HomeTelugu Trendingత్రిపాత్రాభినయంలో నందమూరి హీరో?

త్రిపాత్రాభినయంలో నందమూరి హీరో?

4 26
నందమూరి కల్యాణ్ రామ్ ఒక వైపున ఎన్టీఆర్‌తో ఓసినిమాను నిర్మించడానికి సన్నాహాలు చేసుకుంటునే, మరో వైపున తను హీరోగా వరుస సినిమాలను అంగీకరిస్తూ వెళుతున్నాడు. ఈ క్రమంలోనే ఆయన మల్లిడి వేణు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. విభిన్నమైన కథాకథనాలతో కూడిన ఈ సినిమాను తన బ్యానర్లోనే నిర్మిస్తున్నాడు.

ఇక వీఐ ఆనంద్ దర్శకత్వంలో మహేష్‌ కోనేరు నిర్మించే సినిమా ఒకటి, గుహన్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించే సినిమా ఒకటి లైన్లో వున్నాయి. ఈ నేపథ్యంలోనే మైత్రీ మూవీ మేకర్లు కల్యాణ్ రామ్ దగ్గరికి ఒక కథతో వచ్చారట. ఇది త్రిపాత్రాభినయానికి సంబంధించిన కథ. హీరో ట్రిపుల్ యాక్షన్ చేయవలసి ఉంటుంది. ఈ కథ విన్న కల్యాణ్
రామ్ ఇంకా ఎలాంటి సమాధానం ఇవ్వలేదట. వరుస సినిమాలతో బిజీగా వున్న ఆయన ఈ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా? లేదా? అనేది చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu