HomeTelugu Trending'బింబిసార'గా కళ్యాణ్‌రామ్‌

‘బింబిసార’గా కళ్యాణ్‌రామ్‌

Kalyanram 18 movie title an

నందమూరి కళ్యాణ్‌రామ్‌ హీరోగా ఓ సరికొత్త చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈరోజు శుక్రవారం నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ని విడుదల చేసింది మూవీ యూనిట్‌. మగధ సామ్రాజ్యంలోని హర్యంకా రాజవంశ రాజైన బింబిసారుడు జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ‘బింబిసార’ అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేశారు. ఈ నేపథ్యంలో ‘బింబిసార’ మోషన్‌ పోస్టర్‌ని రిలీజ్‌ చేశారు. తనపై దండెత్తి వచ్చిన శత్రుమూకలపై అలుపెరగని పోరాటం చేసిన యోధుడిగా కళ్యాణ్‌రామ్‌ కనిపించారు. వశిష్ట్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో కేథరిన్‌, సమ్యుక్తా మేనన్‌లు హీరోయిన్‌లుగా నటించనున్నారు. చింతరంజన్‌భట్‌ సంగీతం అందించనున్నారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్ సమర్పణలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి కె.హరికృష్ణ నిర్మాతగా వ్యవహరించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu